హీరో కార్తికేయతో అనసూయ స్పెషల్ సాంగ్

by  |
హీరో కార్తికేయతో అనసూయ స్పెషల్ సాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : అనసూయ భరద్వాజ్ నటిగా కొత్త ప్రాజెక్ట్‌లు సైన్ చేస్తూనే మరో పక్క ఐటెం సాంగ్స్‌‌కు ఓకే చెప్తుంది. కోలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్న భామ.. తెలుగులో చేస్తున్న ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమా ట్రైలర్‌తో మరోసారి యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంది. నటిగా ఎంత కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నా..స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులకు గ్లామరస్ టచ్ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘విన్నర్’ ‘ఎఫ్ 2’ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపించిన అనసూయ..మరో సారి ఐటెం సాంగ్ చేయబోతోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో కార్తికేయతో కలిసి స్టెప్స్ వేయబోతోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా..కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈటీవీలో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్‌లో ఇప్పటికే అనసూయ, కార్తికేయ స్టెప్స్ వేయగా..అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed