ఖిలాడి అనసూయ..

by  |
ఖిలాడి అనసూయ..
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ భామ అనసూయ క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. యాంకర్‌గా రాణిస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పవర్‌ఫుల్ రోల్స్‌ను తన కిట్టీలో వేసుకుంటోంది. బుల్లితెరపై జబర్దస్త్ అనిపిస్తూనే సిల్వర్ స్క్రీన్‌పై హవా కొనసాగిస్తోంది. వెండితెరపై ఆల్రెడీ రంగమ్మత్తగా మెస్మరైజ్ చేసిన భామ.. ‘క్షణం, యాత్ర, మీకు మాత్రమే చెప్తా, ఎఫ్ 2, కథనం’ లాంటి సినిమాలతో ఫరవాలేదనిపించింది. ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీస్‌తో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగమార్తాండ’లో కంటెంట్ ఉన్న రోల్స్ చేస్తున్న భామ.. మాస్ మహారాజా లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’లో కిక్ ఇచ్చే రోల్ అందుకుందని టాక్. రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు కాగా.. రంగమ్మత్త కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ రాణించేందుకు అనసూయ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ‘కథనం’ సినిమా తమిళ్‌లో ‘కథై’ పేరుతో డబ్ కాగా.. పలు కోలీవుడ్ స్ట్రెయిట్ ఫిల్మ్స్‌కు కూడా సైన్ చేసింది. మొత్తానికి న్యూస్ ప్రెజెంటర్‌గా కెరియర్ మొదలుపెట్టిన భామ.. తెలుగుతో పాటు మరో ఇండస్ట్రీలో చాన్స్ చేజిక్కించుకునే వరకు వెళ్లడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Next Story