‘లైగర్’ భామ రికార్డ్.. క్లైమేట్ చేంజ్‌పై అదిరిపోయే స్పీచ్

by  |

దిశ, సినిమా: గ్లోబల్ సిటిజన్ లైవ్ షో ముంబైలో ఘనంగా జరిగింది. ప్రపంచంలో ఆకలిని అంతం చేయడం, వాతావరణ మార్పులపై అవగాహన, కొవిడ్ 19 వ్యాక్సినేషన్‌కు ఫండ్ రైజ్ చేయడమే ఈ స్టార్ స్టడెడ్ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించిన హీరోయిన్ అనన్య పాండే.. క్లైమేట్ చేంజ్ వల్ల భూమిపై జీవజాతులు అంతరించి, తీవ్ర పేదరికానికి దారితీస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘డిఫెండ్ అవర్ ప్లానెట్, డిఫీట్ పావర్టీ’ మెసేజ్ ఇచ్చిన ఆమె.. ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అల్లాడుతున్న 41 మిలియన్ పీపుల్‌కు సాయపడేందుకు ముందుకు రావాలని కోరింది. ఇక ఈ ఈవెంట్‌కు శారీలో అటెండైన ‘సారా అలీ ఖాన్’ లైమ్ లైట్ అటెన్షన్ క్యాచ్ చేయగా.. జాన్వీ కపూర్, దియా మీర్జా, అర్జున్ కపూర్, అనిల్ కపూర్‌లు కూడా హాజరయ్యారు.

Next Story

Most Viewed