‘పుష్పక విమానం’లో మిడిల్ క్లాస్ హీరో

by  |
‘పుష్పక విమానం’లో మిడిల్ క్లాస్ హీరో
X

దిశ, సినిమా : ‘దొరసాని’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తల్లి నేర్పించిన బాంబే చట్నీ ద్వారా ఫేమస్ అయ్యేందుకు గుంటూరులో హోటల్ పెట్టే రాఘవ పాత్రలో ఆనంద్ పర్‌ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. కాగా ఆనంద్ తన మూడో సినిమా కోసం ఓ యూనిక్ కాన్సెప్ట్‌‌కు ఓకే చెప్పగా.. డార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ట్విట్టర్ వేదికగా రివీల్ చేసిన విజయ్.. మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘పుష్పక విమానం’ అనే టైటిల్‌తో వస్తున్న సినిమాతో దామోదర అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లు కాగా, సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్రల్లో కనిపించనున్నారు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మరిచిపోలేని జ్ఞాపకం

Next Story

Most Viewed