నా భూమిని లాక్కోకండి.. ఎమ్మార్వో కాళ్లపై పడ్డ వృద్ధురాలు

by  |
నా భూమిని లాక్కోకండి.. ఎమ్మార్వో కాళ్లపై పడ్డ వృద్ధురాలు
X

దిశ, పర్వతగిరి: జీవనాధారంగా చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న తమ భూమిని లాక్కోవద్దని మల్లమ్మ అనే వృద్ధురాలు తహశీల్దార్ మహబూబ్ అలీ కాళ్ళ మీదపడి ప్రాధేయపడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తమ కుమారుడు కుమార స్వామికి చెందిన 2 ఎకరాల 20 గుంటల భూమిని 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూమిని తీసుకుని తమ పోట్ట కొట్టవద్దని వృద్ధురాలు పర్వతగిరి తహసీల్దార్ మహబూబ్ అలీ కాళ్ళ మీద పడింది. ఇటీవల రూర్బన్ ప్రాజెక్టు కింద అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా.. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన తహసీల్దార్ కాళ్ళ మీద పడి తమ జీవనాధారమైన భూమిని లాక్కోవద్దని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.


Next Story