- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ దేశంలో భారతీయుడు.. అనుమానస్పద మృతి!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి, విద్య ఇతర కారణాల రీత్యా ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయులు హత్యలకు గురి కావడమే కాకుండా, ఆత్మహత్యలకు పాల్పడి అనమానస్పదంగా మృతిచెందుతున్నారు. తాజాగా కెనడాలో 22ఏళ్ల భారత యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం, పాటియాలా జిల్లాకు చెందిన హర్మిందర్ సింగ్(22).. 2017లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ చదువు పూర్తయ్యాక.. ఉద్యోగం చేసుకుంటూ.. అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో హర్మిందర్ సింగ్.. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి, విద్య ఇతర కారణాల రీత్యా ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయులు హత్యలకు గురి కావడమే కాకుండా, ఆత్మహత్యలకు పాల్పడి అనమానస్పదంగా మృతిచెందుతున్నారు. తాజాగా కెనడాలో 22ఏళ్ల భారత యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. వివరాల్లోకి వెళితే..
పంజాబ్ రాష్ట్రం, పాటియాలా జిల్లాకు చెందిన హర్మిందర్ సింగ్(22).. 2017లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ చదువు పూర్తయ్యాక.. ఉద్యోగం చేసుకుంటూ.. అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో హర్మిందర్ సింగ్.. ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు కెనడా పోలీసులు.. అతని తల్లిదండ్రులకు ఆదివారం ఉదయం సమాచారం అందించారు.
కొడుకు మృతిచెందిన వార్త తెలిసిన తల్లిదంద్రులు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి సుఖ్వీంధర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ… తన కొడుకు ఆత్మ చేసుకునేంత పిరికిడివాడు కాదని, ఈ కేసుపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






