నయన్‌కు పోటీగా సామ్

by  |
నయన్‌కు పోటీగా సామ్
X

సమంత అక్కినేని ఫుల్ జోష్‌లో ఉంది. జాను సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేసేలోపే మరో సినిమాను మొదలెట్టేసింది. చైతుతో మ్యారేజ్ తర్వాత చాలా సెలెక్టెడ్‌గా మూవీస్ చేస్తున్న సామ్… తమిళంలో విజయ్ సేతుపతితో జోడి కడుతోంది. జాను సినిమాతో త్రిషను మరిపించిన సామ్ ఇప్పుడు నయనతారతో పోట్లాటకు దిగుతోంది. అదేంటి అనుకుంటున్నారా? సామ్ నెక్స్ట్ సినిమాలో నయనతారతో పోరాడబోతోందటా? ఎందుకు అంటే .. ఇంకెందుకు? విజయ్ సేతుపతి కోసం.

అవును ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా వస్తున్న కాతు వాకులా రెండు కాదల్ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా నటించబోతున్నారు నయనతార, సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లవ్‌స్టోరీ చాలా కొత్తగా ఉండబోతోందట. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలో సామ్, నయన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.



Next Story

Most Viewed