అంతు చిక్కని వ్యాధితో 40 మందికి అస్వస్థత

by  |
అంతు చిక్కని వ్యాధితో 40 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి గత్తరలేపింది. చిన్నారుల నోటి నుంచి నురగ వచ్చి దాదాపు 40 మంది అస్వస్థతకు లోనయ్యారు. మూర్ఛ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 సంవత్సరాల లోపు ఉన్నవారే ఎక్కువున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు నిండిపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed