ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్ధం

by  |
ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్ధం
X

దిశ, మెదక్: ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్ధం అయ్యింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో జరిగింది. రైతు చంద్రారెడ్డి వివరాల ప్రకారం.. తనకున్న నాలుగెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటను మూడు రోజుల క్రితం కోత చేపట్టి, దిగుబడి కంకులను చేనులోనే నిల్వ చేశాడు. ఉదయం చేను దగ్గరకెళ్లి చూడగా పంట మొత్తం దగ్ధమై ఉంది. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతు.. అధికారులు విచారణ చేపట్టి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

Tags : accidental fire, corn crop, medak, 3 days, siddipet

Next Story

Most Viewed