ఎమ్మెల్యే సభలో జర్నలిస్టుల‌కు అవమానం

మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోసం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశం

Update: 2022-09-25 11:10 GMT

దిశ దంతాలపల్లి: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోసం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు, విలేకరులకు, కార్యకర్తలకు కుర్చీలు కూడా కరువయ్యాయి. ఈ విషయంపై మీడియా మిత్రులు ప్రజా సేవ కొరకై నేలపైనే కూర్చొని మహిళలకు , ప్రజలకు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ చెప్పే సూచనలు సలహాల నమోదు చేశారు. కింద కూర్చునొ వార్తలు రాస్తుంటే, సమావేశానికి హాజరైన మహిళలు ఆలోచనలో పడి పలు విధాలుగా గుసగుసలు పెట్టడం మొదలైంది.

అదే విధంగా సభలో కూర్చొని ఉన్న మండలంలోని ఓ ప్రముఖ ప్రజా ప్రతినిధి మీరు నాకు దొరకరా బెదిరించినట్లు మట్లాడటమే కాకుండా.. కింద కూర్చొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ప్రశ్నించగా దంతాలపల్లీ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిల్ల నిరంజన్ తో సహా తదితర పత్రిక ప్రతినిధులు సభలో నుండి వెళ్ళిపోయారు.ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు ఏర్రబోయిన మురళి,గొల్లగట్టు దాసు,అనపర్తి వీరన్న, ,రాములు పాల్గొన్నారు.

Similar News