అరూరి రమేష్ అంటే అవినీతి,ఆగడాల రమేష్.. : కడియం కావ్య

అరూరి రమేష్ అంటే అవినీతి రమేష్,అకృత్యాల రమేష్, ఆగడాల

Update: 2024-04-29 12:28 GMT

దిశ,గీసుగొండ: అరూరి రమేష్ అంటే అవినీతి రమేష్,అకృత్యాల రమేష్, ఆగడాల రమేష్ అని గుర్తు పెట్టుకోండని వరంగల్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలోని పీఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ మే13న జరిగేది లోకసభ ఎన్నికలు కాదు మనుధర్మ శాస్త్రనికి,అంబేద్కర్ రాజ్యాంగానికి మధ్య యుద్ధం అని , రాముణ్ణి జెండాలలో పెట్టుకు నేది వాళ్లయితే, రాముణ్ణి గుండెల్లో పెట్టుకునేది మనంఅని ,మన గుండె చప్పుడులో వినిపించేవి రెండే రెండు ఒకటి జై భీమ్ రెండు జై కాంగ్రెస్,అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో మన తలరాత ను మార్చుకునే అవకాశం వచ్చింది అని అన్నారు.

అంబానీ, అదానిలకు కొమ్ము కాసే నరేంద్ర మోడీ కావాలా పేద ప్రజల సంక్షేమానికి పాటు పడే రాహుల్ గాంధీ కావాలో ఒక్కసారి ఆలోచన చేసుకో వాలని,దళితులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని, కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని, దళితులకు సమూచిత స్థానం దక్కెది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే దక్కుతుందని,మే13న జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. వరంగల్ లోకసభ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. బిఆర్ఎస్ పార్టీ,మందకృష్ణ మాదిగ బిజెపి పార్టీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ తన యొక్క పంతాన్ని మార్చుకొని దళిత బిడ్డ అయినా డాక్టర్ కడియం కావ్య గెలుపునకు సహకరించాలని తెలిపారు.ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగానైతే మెజారిటీ తెచ్చారో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకన్నా రెట్టింపు మెజార్టీ తీసుకురావాలన్నారు.వరంగల్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపునకు దళిత, క్రిస్టియన్ సోదరీ సోదరీమణుల కృషి ఉండాలన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాయ మాటలు,డబ్బు ప్రలోభాలాను తిప్పికొట్టాలని సూచించారు. సామాజిక న్యాయం,సమాన త్వం కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు.ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి,మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మా వతి,టిపిసిసి కోఆర్డినేటర్ ప్రో.గాదె దయాకర్,ఎస్సి సెల్ జిల్లా చైర్మన్లు పెరుమాండ్ల రామ కృష్ణ,ఆనంద్ కుమార్,పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి,ఎంపీపీ భీమగాని సౌజన్య,మండల అధ్యక్షుడు టి. శ్రీనివాస్, ఎస్ సి సెల్ జిల్లా ఉపాధ్య క్షులు ధూపాకి సంతోష్,కొమ్ము శ్రీకాంత్,ఆయా మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షుడు,ఎస్సీ సెల్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News