జేఎన్ఎస్ వేసవి క్రీడా శిబిరాల్లో కరువైన సురక్షిత శిక్షణ

ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికమైన క్రీడా మైదానం జవహర్ లాల్

Update: 2024-05-16 11:32 GMT

దిశ,కేయూ క్యాంపస్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికమైన క్రీడా మైదానం జవహర్ లాల్  నెహ్రూ స్టేడియం లో పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వేసవి సెలవుల దృష్ట్యా వివిధ క్రీడల్లో శిక్షణను నిర్వహిస్తున్నాయి. మే 1న ప్రారంభమైన ఈ క్రీడా శిబిరాల్లో ఈ మైదానంలో శిక్షణ పొందే బాల బాలికలకు సురక్షితమైన క్రీడా శిక్షణ పొందే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వేసవి క్రీడా శిబిరాల చుట్టుపక్కల ప్రమాదకరంగా మట్టి కుప్పలు, పునాది బండ రాళ్ల కుప్పలు, ఎండిపోయిన చెట్ల మోడులతో చాలా ఇబ్బందికరంగా ప్రమాదకరంగా ఉన్నాయని పలువురు విద్య శిక్షణ పొందుతున్న బాల బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు.

శిక్షణ తరగతులు మొదలు కాకముందే స్టేడియం ను క్రీడలకు అనుకూలంగా శుభ్రం చేసి పిచ్ , చదును చేసిన క్రీడ కోర్ట్ ఏర్పాటు చేసి సురక్షితంగా ఉండాల్సిందని ప్రతీ సంవత్సరం ఇదే విధంగా ఆలనా పాలన లేకుండా ఉంటుందని గత రెండు సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ శిక్షణ కోసం తమ పిల్లలను తీసుకొస్తున్న ఒక పేరెంట్ వాపోయారు. దీనికి తోడు స్టేడియం చుట్టూరా ఉన్న డ్రైనేజీ లో మట్టిచేరి ప్లాస్టిక్ బాటిల్స్ తో నిండిపోయి డ్రైనేజీ లో పెరిగిన పిచ్చి మొక్కలు ఫెన్సింగ్ కి అల్లుకొని స్టేడియం ఫెన్సింగ్ అందవిహీనంగా కనబడుతోంది. శిక్షణ అయినంత సేపు వారి పిల్లలు వారెక్కడ ప్రమాదానికి గురవుతారో అన్న భయం కొద్ది శిక్షణ పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. కేవలం ఈ వేసవి క్రీడా శిబిరాలు మే ఒకటి నుంచి మే 30 రోజుల పాటు ఉండే జె ఎన్ ఎస్ లో అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ కిక్ బాక్సింగ్, ఖో ఖో, లాంగ్ టెన్నిస్ హాకీ, టెన్నికాయిట్, యోగ, టైక్వాండో, సాఫ్ట్ బాల్, వాలీబాల్, నెట్ బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, రెజ్లింగ్, జూడో వంటి క్రీడాంశాలలో వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారని దరఖాస్తులు కోరారు. కొన్ని క్రీడలకు పే అండ్ ప్లే సదుపాయాలతో క్రీడా శిక్షణ పొందవచ్చు.

నిజానికి ఈ ఓపెన్ స్టేడియం ని మెయింటెన్ చేయడానికి గ్రౌండ్ స్థాయి సిబ్బంది ఉంటారు. వీరికి పనిని కేటాయించడం కోసం జిల్లా స్థాయి క్రీడా అధికారులు ఉంటారు. మీరు నిరంతరం సురక్షితమైన ప్లే ఫీల్డ్ ను మెయింటైన్ చేస్తూ ఔత్సాహిక క్రీడాకారులను తీర్చిదిద్దడమే వీరి వృత్తి. ఈ వృత్తికి అంకిత భావంతో చేసిన క్రీడా అధికారులు అతి తక్కువ. ప్రస్తుతం ఉన్న క్రీడా అధికారి గత నాలుగు సంవత్సరముల నుంచి వ్యక్తిగతంగా ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదని గ్రౌండ్ పరంగా ఎటువంటి మెయింటెనెన్స్ చేస్తే లేరన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన గతంలో కరీంనగర్ లో చేసి పలు ఆరోపణలు నేపథ్యంలో వరంగల్ జిల్లాకు బదిలీ పైన వచ్చినట్లు సమాచారం. ఇటీవల వరంగల్ పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల దృష్ట్యా నిర్వహించిన 5-కే రన్ సమయంలో జే ఎన్ ఎస్ స్టేడియం పరిస్థితి కలెక్టర్ల దృష్టికి పోలేదా అని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా జిల్లాకు తలమానికమైన స్టేడియం సరైన మెయింటెనెన్స్ లేక క్రీడాకారుల ఉత్సాహం నీరుగారి పోతుందనీ.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మరియు సంబంధిత ఉన్నతాధికారులు, క్రీడా అధికారులు దృష్టి సారించి భావి క్రీడాకారులకు సురక్షిత క్రీడా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

Similar News