సదస్సులో చొరబడి అల్లరి సృష్టించిన బీజేపీ ఫాసిస్టు మూకలను తరిమికొట్టండి : పీఓడబ్ల్యూ

కాకతీయ యూనివర్సిటీ లో సమూహ ఆధ్వర్యంలో ఆదివారం రోజు

Update: 2024-04-29 14:35 GMT

దిశ, వరంగల్ కలెక్టరేట్ : కాకతీయ యూనివర్సిటీ లో సమూహ ఆధ్వర్యంలో ఆదివారం రోజు 'లౌకిక విలువలు - సాహిత్యం' అనే సదస్సు నిర్వహించబడింది. కొందరు ఫాసిస్టు మూకలు అనుమతి లేకుండా చొరబడి అల్లరి సృష్టించి ప్రముఖ కవులపై భౌతికంగా దాడి చేసి గాయపరిచిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యు) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ తరపున రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, అందే మంగ డిమాండ్ చేశారు. ప్రముఖ కవులైన డా. పసునూరి రవీందర్, నరేష్ కుమార్ సూఫీ, మెర్సీ మార్గరెట్, అన్వర్, బిల్లా మహేందర్, భూపతి వెంకటేశ్వర్లు తదితరులపై భౌతికంగా దాడి చేసి గాయపర్చడంతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీస్తున్నారని దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేస్తూ మతోన్మాదంతో ఫాసిస్టు పాలనకు పాల్పడుతున్న బీజేపీ కాషాయమూకలను తరిమి కొట్టడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని కోరారు. హేతుబద్ధ భావాలపై దాడి చేయడమంటే పచ్చి నిరంకుశ మనువాద భావాలను పునప్రతిష్టించడానికే ప్రజాస్వామిక ఉద్యమాలను కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యంగా సంఘటిత ప్రతిఘటనకు సన్నద్ధం కావాలని దాడి చేసిన ఫాసిస్టు మూకలను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని ప్రగతిశీల మహిళ సంఘం (పీఓడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు.

Similar News