ఒక్క అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేసి చూపిస్తా..: కడియం కావ్య

అరూరి రమేష్ అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలువలేదు..ఇప్పుడేం

Update: 2024-04-29 14:50 GMT

దిశ, తొర్రూరు: అరూరి రమేష్ అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలువలేదు..ఇప్పుడేం గెలుస్తాడని..వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాట్ కామెంట్స్ చేశారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో నిర్వహించిన ఎన్నికల సన్నాహా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ,దళితులకు సముచిత స్థానం దక్కెది అని ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే దక్కుతుందని,మే13న జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పైన వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. వరంగల్ లోకసభ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి అని, బీఆర్ఎస్ పార్టీ,మందకృష్ణ మాదిగ బీజెపే పార్టీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారు అని, ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ తన పంతాన్ని మార్చుకొని దళిత బిడ్డ అయినా డాక్టర్ కడియం కావ్య గెలుపునకు సహకరించాలని తెలిపారు.ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగానైతే మెజారిటీ తెచ్చారో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకన్నా రెట్టింపు మెజార్టీ తీసుకురావాలన్నారు.

ఎమ్మెల్యే యశశ్విని రెడీ మాట్లాడుతూ.. 2023 జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రజలు పాలకుర్తి నియోజకవర్గం లో నియంత పాలనకు చరమగీతం పాడారని గుర్తు చేశారు, అదేవిధంగా మన అభ్యర్థి డా, కడియం కావ్య కూడా భారీ మెజార్టీతో గెలిపించి పాలకుర్తి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జ్ లు, తొర్రురు మండల అధ్యక్షుడు,పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, పట్టణ యూత్ నాయకులు, ముఖ్య నాయకులు, తదితరులు, పాల్గొన్నారు

Similar News