ప్లీజ్ పాల‌భిషేకాలు వ‌ద్దు: వ‌రంగ‌ల్ సీపీ రంగ‌నాథ్‌

నా ఉద్యోగ నిర్వహణలో భాగంగానే భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నానని, భూ బాధితులు ఎవరూ తన చిత్రాలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వాటికి పాలభిషేకాలు చేయవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ్‌ భూ బాధితులకు సూచించారు.

Update: 2023-04-02 09:41 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: నా ఉద్యోగ నిర్వహణలో భాగంగానే భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నానని, భూ బాధితులు ఎవరూ తన చిత్రాలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వాటికి పాలభిషేకాలు చేయవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ్‌ భూ బాధితులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు భూ కబ్జాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి బాధితులకు తగు రీతిలో న్యాయం చేస్తుండడంతో పాటు భూ కబ్జా రాయుళ్ల భరతం పడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ ద్వారా న్యాయం పొందిన బాధితులు పోలీస్ కమిషనర్ రంగనాథ్ పై తమ అభిమానం చాటుతున్నారు. కృతజ్ఞత భావంతో బాధితులు పోలీస్ కమిషనర్ చిత్రాలతో కూడిన ప్లెక్సీలను కూడళ్లలో ఏర్పాటు చేసి పాలభిషేకాలు జరపడంపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

Tags:    

Similar News