ఫైళ్లు మాయమవడంలో రిజిస్ట్రార్ పాత్ర ఎంత!!

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ వీసీ ప్రో.రమేష్ పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల తేదీ 17 న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి విజిలెన్స్ విచారణ కొరకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-23 16:02 GMT

దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ వీసీ ప్రో.రమేష్ పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల తేదీ 17 న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి విజిలెన్స్ విచారణ కొరకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తేదీ 20 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయం లోపల వీసీ లాడ్జి నుంచి పలు ఫైళ్ల సంచులు యూనివర్సిటీ నుండి బయటకు వెళ్ళాయని తెలుసుకున్న ఆకుట్ జనరల్ సెక్రటరీ డా ఇస్తారి, అధ్యక్షులు ప్రో తౌటం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రో. బ్రహ్మేశ్వరి, సంయుక్త కార్యదర్శి డా కిషోర్ కుమార్, డా రమేష్ కుమార్ లు పరిపాలన భవనానికి చేరుకొని రిజిస్ట్రార్ తో రెండు రోజుల క్రితం వాగ్వాదానికి దిగారు.

రిజిస్ట్రార్ రెండు రోజుల్లో సీసీ టీవి ఫుటేజ్ తీయించి పరిశీలిస్తామని చెప్పారన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టడంలో కావాలనే రిజిస్ట్రార్ జాప్యం చేస్తున్నారని, మూడు రోజులైనా సీసీ.టీవీ ఫుటేజ్ బయటపెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటనీ రిజిస్ట్రార్ ను ప్రశ్నించారు. ఫైళ్లు మాయమవడంలో రిజిస్ట్రార్ పాత్ర కూడా ఉంటుందనే అపోహలు వస్తున్నాయని విజిలెన్స్ విచారణలో అవినీతి బయట పడే అవకాశం ఉన్న ఫైళ్ళను మార్ఫింగ్ చేయడానికి వీసీ లాడ్జి నుండి వాటిని మాయం చేశారని అన్నారు. వెంటనే సీసీ టీవీ ఫుటేజ్ బయట పెట్టి మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డా మామిడాల ఇస్తారి డిమాండ్ చేశారు.

Similar News