మదనాపురం ఆధార్ సేవలకు దూరం

మండలంలో ఆధార్‌ కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిన్నారులకు కొత్తగా ఆధార్‌కార్డు దరఖాస్తు చేయాలన్నా, కొత్త పెళ్లి చేసుకుని

Update: 2024-05-24 09:33 GMT

దిశ, మదనాపురం : మండలంలో ఆధార్‌ కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిన్నారులకు కొత్తగా ఆధార్‌కార్డు దరఖాస్తు చేయాలన్నా, కొత్త పెళ్లి చేసుకుని వచ్చినవారి చిరునామా మార్పుతో పాటు, ఆధార్‌కార్డులో తప్పొప్పుల సవరణకు ఇతర కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. తీరా అక్కడకి వెళ్లాక ఇంటర్నెట్‌, ఇతర సాంకేతిక సమస్యలతో పనులు జరగడం లేదని, అక్కడ పట్టణ ప్రజలతో పాటు, ఇతర మండలాల ప్రజలు కూడా రావడంతో రద్దీ నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు.

అదేవిధంగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉన్నది. ఆధార్‌ సెంటర్‌ లేకపోవడంతో వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్లాక సర్వర్‌ రాకపోవడంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు విన్నవించికున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలి ప్రజలు కోరుతున్నారు.

Similar News