పోలీసుల అదుపులోకి పేకాట రాయుళ్లు..

మండలంలోని గంధంపల్లి పంచాయతీ పరిధిలో ఓ నిర్మానుష్య

Update: 2024-05-24 16:04 GMT

దిశ, బయ్యారం : మండలంలోని గంధంపల్లి పంచాయతీ పరిధిలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో కొంతమంది శుక్రవారం పేకాట ఆడుతున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు బయ్యారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సంఘటన ప్రాంతంలో ఎంత నగదు పట్టుకున్నారో పోలీసు అధికారుల ద్వారా సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై సీఐ రవికుమార్ వివరణ కోరగా పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న మా సిబ్బంది పలువురు అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని, నేను అందుబాటులో లేనని పూర్తి వివరాలు రేపు మీడియా కు వెల్లడిస్తామని తెలిపారు.

Similar News