రైలు కింద పడిన యువతి మృతి

రైలు కింద పడిన యువతి మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్

Update: 2024-05-24 16:22 GMT

దిశ, వరంగల్ : రైలు కింద పడిన యువతి మృతి చెందిన ఘటన వరంగల్  రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మ (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గ కు చెందిన చెన్నకేశవ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడుమోరీల వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతి చెందింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు మీద ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు సమాచారం అందించినట్లు వారు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పూర్తి వివరాలు తెలియజేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ ఆర్పీ, వరంగల్ ఆర్పీఎస్ తెలిపారు.

Similar News