రోడ్డు ప్రమాదాలకు కారణం పాదచారుల అజాగ్రత్తే.. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

పాదచారుల అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణమని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

Update: 2023-06-26 06:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాదచారుల అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణమని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ఈ రోడ్డు ప్ర‌మాదాలే జ‌రిగాయని, తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారని తెలిపారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, పాదచారులు ఫుట్‌పాత్‌ల‌నే ఉపయోగించుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారని, రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

జీబ్రాలైన్‌ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్‌ చేయాలని, పరధ్యానంలో అసలే ఉండొద్దన్నారు. పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్‌ లైట్లను ఉపయోగించాలన్నారు. సెల్‌ఫోన్‌, హియర్‌ ఫోన్స్‌ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరమని, వాటి వల్ల వాహనాల హరన్‌ వినపడదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలని పలు నిబంధనలు పాదచారులకు సూచించారు. 

Click here for Twitter post From V.C. Sajjanar, IPS

Read more : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ చార్జీలను భారీగా తగ్గించిన TSRTC

Tags:    

Similar News