రామ మందిరానికి ‘కీ’.. ప్రధాని వ్యాఖ్యలకు ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తోందన్న మోడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.

Update: 2024-05-22 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తోందన్న మోడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు. నోట్ల రద్దు సమయంలో తాళాలు పడ్డ ఫ్యాక్టరీల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తుచేశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో యూపీకి చెందిన ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని చాలా మంది చనిపోయారని ఆయన వాటి గురించి మాట్లాడరని ఎద్దేవా చేశారు.

Similar News