ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ చార్జీలను భారీగా తగ్గించిన TSRTC

by Disha Web Desk 19 |
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ చార్జీలను భారీగా తగ్గించిన TSRTC
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ (Advance booking) చార్జీల‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(TSRTC) స‌వ‌రించింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ లగ్జరీ, ఏసీ స‌ర్వీసుల్లో చార్జీల‌ను త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీట‌ర్లకు రూ.30గా చార్జీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ సర్వీసుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నుంది.

"టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌కు మంచి స్పంద‌న ఉంది. ప్రతి రోజు స‌గ‌టున 15 వేల వ‌ర‌కు త‌మ టికెట్లను ప్రయాణికులు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను త‌గ్గించ‌డం జ‌రిగింది. ఈ స‌దుపాయాన్ని ప్రయాణికులంతా ఉప‌యోగించుకుని.. సంస్థను ఆద‌రించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్​ కోరారు.

Read more : రోడ్డు ప్రమాదాలకు కారణం పాదచారుల అజాగ్రత్తే.. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్



Next Story

Most Viewed