ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్

రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ, ఉప్పల వెంకటేష్ అన్నారు.

Update: 2022-10-07 13:58 GMT

దిశ, తలకొండపల్లి : రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ, ఉప్పల వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని గురువారం 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని, ఒక మోస్తరుగా భారీ వర్షాలు కురిసి గ్రామాలన్నీ తడిసి ముద్ద అయ్యాయన్నారు.

మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో రైతు సోదరులు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, బోరు మోటర్ల వద్ద జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుచూపుతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామాల్లోని పాడుబడిన మిద్దె కప్పు ఇండ్లలో, మట్టి ఇండ్లలో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లల్లోని కరెంటు వాడే విషయంలో తడి చేతులతో ముట్టుకోకూడదని పలు సూచనలు సలహాలు చారు.

గురువారం రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, ఆమనగల్లు మండలంలోని అతి భారీ వర్షం కురిసి పలుగ్రామాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయన్నారు. వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణా నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని అన్నారు. మరో మూడు రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News