‘భగత్ సింగ్ ఆలోచనలు కొనసాగిస్తాం’

దిశ, సిద్దిపేట: భారతదేశ కొదమ సింహం భగత్ సింగ్ 113వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్‌యూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగ్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, టీపీఎఫ్ నాయకులు సత్తయ్యలు మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య౦ కోసం నూనూగు మీసాల ప్రాయ౦లోనే జీవితాన్ని త్యాగం చేశాడని, ఉరికొయ్యను ముద్దాడాడని కొనియాడారు. భగత్ సింగ్ కులమతాలు లేని సమనత్వ […]

Update: 2020-09-28 03:54 GMT

దిశ, సిద్దిపేట: భారతదేశ కొదమ సింహం భగత్ సింగ్ 113వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్‌యూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగ్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, టీపీఎఫ్ నాయకులు సత్తయ్యలు మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య౦ కోసం నూనూగు మీసాల ప్రాయ౦లోనే జీవితాన్ని త్యాగం చేశాడని, ఉరికొయ్యను ముద్దాడాడని కొనియాడారు.

భగత్ సింగ్ కులమతాలు లేని సమనత్వ సమాజాన్ని కాంక్షించడని కానీ ప్రస్తుతం భగత్ సింగ్‌కు మతం రంగు పులమడం కోసం సంఘ్ పరివార్ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అందులో భాగమే పూలే, పెరియర్, బుద్ధుడు లాంటి మహనీయుల చరిత్రను పాఠ్యంశాల్లో నుంచి తొలగిస్తున్నారని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని ఎదుర్కొనేందుకు యువత కృషి చేయాలని అదే భగత్ సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News