HYD : సినీ నిర్మాతకు ఆర్టిస్ట్ టోకరా.. ఆడిషన్స్ కోసం వచ్చి ఏం చేశాడో తెలుసా..?

హైదరాబాద్‌లో సినీ నిర్మాతకు ఓ కళాకారుడు ఝలక్ ఇచ్చాడు.

Update: 2024-05-04 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ కోసం వచ్చిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ నిర్మాత ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లో సినీ నిర్మాత ఇంటికి కళాకారుడు ఇటీవల ఆడిషన్స్ కోసం వచ్చాడు. అయితే సదరు యువకుడు నిర్మాత ఇంటికే కన్నం వేశాడు. 13 తులాల బంగారం, రూ.50వేల నగదు, ఖరీదైన వాచ్ చోరీ చేశాడు. చోరీ జరిగినట్లు గ్రహించిన నిర్మాత ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News