రూ.23 కోట్లు విలువ చేసే బంగారం ఎలా తరలిస్తున్నారో తెలుసా..?

రూ.23 కోట్లు విలువ చేసే బంగారం, వెండిని నిర్లక్ష్యంగా, సరైన సెక్యూరిటీ లేకుండా తరలిస్తున్న వైనం పోలీస్‌లను కలవరానికి గురి చేసింది.

Update: 2024-05-04 04:26 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : రూ.23 కోట్లు విలువ చేసే బంగారం, వెండిని నిర్లక్ష్యంగా, సరైన సెక్యూరిటీ లేకుండా తరలిస్తున్న వైనం పోలీస్‌లను కలవరానికి గురి చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ముంబైకి చెందిన నాప్ లాగ్ లాజిస్టిక్, మారుద్దార్ ఎక్స్‌ప్రెస్, మా భవాని లాజిస్టిక్స్ సర్వీసెస్ ముంబై నుంచి హైదరాబాద్ కు 34.78 కేజీల బంగారం, 43.60 కేజీ ల వెండిని తీసుకువస్తున్నట్లు గుర్తించారు. వాటిని నగరంలో వివిధ బంగారం దుకాణాలకు సరఫరా చేయడానికి తీసుకువెళ్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించి సరైన పత్రాలు, సెక్యూరిటీ లేకపోవడంతో పోలీసులు వాటిని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు అప్పగించారు. ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు.

Similar News