వాట్సాప్ యూజర్లకు మరో కొత్త అప్డేట్ తో గుడ్ న్యూస్.. ఇక నుంచి అందుబాటులోకి ఆ ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల మెప్పు పొందేలా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్ లను పరిచయం చేస్తూనే ఉంటుంది.

Update: 2024-05-18 05:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల మెప్పు పొందేలా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్ లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ నేపధ్యంలోనే యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతూ..వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ 'స్టేటస్ అప్‌డేట్స్-1 మినిట్' ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు 1 నుంచి 30 సెకన్ల నిడివి మధ్య ఉన్న వీడియోలు మాత్రమే స్టేటస్ గా పెట్టుకునేందుకు వీలు ఉండగా.. ఈ కొత్త అప్‌డేట్ తో ఒక నిమిషం నిడివి గల వీడియోలను స్టేటస్ గా పెట్టుకునేందుకు వీలు కల్పించింది. ప్రస్తుతం ఆ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ లో వెల్లడించింది.  

Similar News