తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’..T- బీజేపీ సంచలన ట్వీట్

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిదగుడ్డు ఇచ్చిందని ఇటీవల కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తోంది.

Update: 2024-05-04 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిదగుడ్డు ఇచ్చిందని ఇటీవల కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తోంది. అందరికీ ఈజీగా రీచ్ అయ్యేలా హస్తం పార్టీ ఈ ప్లాన్ వేసింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గుడ్డను ప్రదర్శించడం సంచలనం రేపింది. ఇక, కాంగ్రెస్ ‘గాడిదగుడ్డు’ క్యాంపెయినింగ్‌పై టీ-బీజేపీ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. ‘6 గ్యారంటీలతో ధోకా.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు’ అని కౌంటర్ ఇచ్చింది.

రూ.2లక్షల రైతు రుణమాఫీ ఒకటవ గుడ్డు అని, వరికి రూ.500 బోనస్ రెండవ గుడ్డు అని సెటైర్లు వేసింది. కౌలు రైతులకు రూ.15వేల రైతుభరోసా మూడవ గుడ్డు అని.. రైతు కూలీలకు రూ.12 వేల సహాయం పేరిట 4 వగుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేసింది. విద్యార్థులకు రూ.5లక్షల హామీతో 5వ గుడ్డు, నిరుద్యోగులకు నెలకు రూ.4వేల హామీతో 6 గుడ్లు ఇచ్చిందని మండిపడింది. మహిళలకు రూ.2,500 పేరిట 7 వ గుడ్డు ఇచ్చిందని పంచ్‌లు వేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌పై బీజేపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Click here for BJP Tweet

Similar News