LEO Movie:మైనస్​10 డిగ్రీల టెంపరేచర్‌లో ‘లియో’ టీమ్.. షూటింగ్ వీడియో వైరల్

స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’.

Update: 2023-03-24 08:29 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇటీవలే కశ్మీర్‌లో 56 రోజుల షెడ్యూల్​పూర్తిచేసుకుని మూవీటీమ్ చెన్నైకి చేరుకుంది. ఈ సందర్భంగా కశ్మీర్ షెడ్యూల్‌లో తమ సిబ్బంది శ్రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రతిఒక్కరూ రాత్రి పగలు కష్టపడి పని చేశారని చెప్పారు. ‘మేమంతా మైనస్​10 డిగ్రీల టెంపరేచర్​ఉన్న లొకేషన్‌లో పనిచేశాం. చలికి మా చేతులు మొత్తం బిగుసుకుపోయాయి. కానీ, పని మాత్రం ఆపలేదు. దర్శకుడు లోకేష్​ఏ మాత్రం సమయం వృధా చేయకుండా షూట్ కొనసాగించాడు. ఎన్నో ఇబ్బందులున్నా అక్కడి ప్రతి మూమెంట్ సంతోషంగా అనిపించింది’ అని చెప్పారు.

Tags:    

Similar News