బిగ్ ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్

బెంగుళూర్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీ ఇటు టాలీవుడ్‌తో అటు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలువురు

Update: 2024-05-25 14:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగుళూర్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీ ఇటు టాలీవుడ్‌తో పాటు అటు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలువురు హాజరై డ్రగ్స్ సేవించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూలో టాలీవుడ్ యాక్టర్ హేమ పేరు మారుమోగిపోతుంది. ఈ రేవ్ పార్టీకి హాజరైన హేమ.. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నటి హేమ ఇష్యూపై ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తొలిసారి రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో నటి హేమకు మద్దతుగా మంచు విష్ణు ట్వీట్ చేశాడు.

హేమపై అసత్య ప్రచారాలు ఆపాలని కోరారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆమె ప్రతిష్టను దెబ్బ తీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని.. నేరం ప్రూవ్ కాకముందే ఆమె ఇమేజ్‌ను దెబ్బ తీయడం కరెక్ట్ కాదని అన్నారు. పోలీసులు కచ్చితమైన సాక్ష్యాలను అందజేస్తే ఆమెపై మా అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పోలీసులు అధికారికంగా చెప్పే వరకు ఆమెపై నిందలు వేడయం ఆపాలని కోరారు. 

Similar News