ఒకరు రోడ్డున పడబోతున్నారు.. సంచలనంగా క్రికెటర్ భార్య పోస్ట్!

ప్రముఖ నటి, మోడల్ నటాషా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-25 14:42 GMT

దిశ, సినిమా: ప్రముఖ నటి, మోడల్ నటాషా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోన టైంలో డేటింగ్‌లోకి ఎంటర్ అయిన ఈ జంట.. ఓ కొడుకు పుట్టాకా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తర్వాత ఈ కపుల్స్ నెట్టింట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాళ్ల ఇద్దరు ముద్దులు పెట్టుకున్న బోల్డ్ ఫొటోలను సైతం నెట్టింట షేర్ చేస్తూ ట్రోల్స్ ఎదర్కొనేవారు. అయితే.. ఈ మధ్య కాలంలో నటాషా, హార్దిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అంతే కాకుండా.. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫొటోస్ తొలగించిన నటాషా.. పాండ్యా అనే పదాన్ని కూడా రిమూవ్ చేసింది. దీంతో విడాకుల ఇష్యూ మరింత రచ్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ సతీమణి, నటి నటాషా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ‘ఒకరు రోడ్డున పడబోతున్నారు’ అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు నెటిజన్లు.



 


Similar News