అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. ఇలా చెయ్యడానికి సిగ్గులేదా అంటూ ఫేమస్ నటి ఎమోషనల్ పోస్ట్

ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి.

Update: 2024-05-25 15:21 GMT

దిశ, సినిమా: ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. మొన్నటికి మొన్న సీరియల్ నటులు పవిత్ర, చందులు కూడా వివాహేతర సంబంధం కారణంగానే ఒకరు మరణించారని మరొకరు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్లను నమ్ముకున్న వాళ్లు మాత్రం రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూనే బాలీవుడ్ బుల్లితెరపై వెలుగు చూసింది.

పేమస్ నటి దల్జీత్ కౌర్ అందరికి గుర్తుండే ఉంటుంది. ‘ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తెలుగులో ‘చూపులు కలిసిన శుభవేళ’గా డబ్బింగ్ చేయబడి ఇక్కడ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్ అక్క పాత్రలో నటించి మెప్పించింది దల్జీత్. ఇదిలా ఉంటే.. దల్జీత్‌కు వివాహం జరిగి ఓ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది ఈ నటి. ‘నువ్వు నన్ను బాగుచేస్తావు!’ అంటూ జిమ్‌లో ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ తన భర్త పోస్ట్ పెట్టాడు.

భర్త పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ‘సిగ్గులేకుండా మీరు ఇప్పుడు ప్రతిరోజూ ఆమెతో సోషల్ మీడియాలో ఉంటున్నారు. మీ భార్య, కొడుకు పెళ్లి నుంచి 10 నెలల్లో తిరిగి వచ్చారు. కుటుంబం మొత్తం మిమ్మల్ని అవమానిస్తుంది. పిల్లల కోసం అయినా ఆలోచించి ఉంటే బాగుండేది. నేను ఇతర విషయాల గురించి చాలా సైలెంట్‌గా ఉన్నా. కనీసం అందుకోసం అయినా ఆలోచించకుండా మీ భార్య పరువును తీశారు’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దాంతో పాటు మరో పోస్ట్‌లో ‘వివాహేతర సంబంధాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఎవరిని నిందించాలి? ఆ అమ్మాయి, భర్త, భార్య’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 






 


Similar News