యువనాయకుడు.. నా లవ** నాయకుడు.. కాకరేపుతున్న విశ్వక్ డైలాగ్స్ (వీడియో)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మూవీతో బిజీగా ఉన్నాడు.

Update: 2024-05-25 15:42 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మూవీతో బిజీగా ఉన్నాడు. కష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ మాస్, రస్టిక్ రోల్‌లో కపిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘మనుషులు మూడు రకాలురా.. ఒకటి నాశిరకం. రెండోది బోసి రకం, మూడోది నాణ్యమైన రకం’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయినా ఈ ట్రైలర్‌లో ‘యువనాయకుడు.. నా లవ** నాయకుడు’ అని విశ్వక్ చెప్పే డైలాగ్ వేరే లెవల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో విశ్వక్ యాక్షన్ చూస్తే.. మాస్ ప్రేక్షకులకు ఈ మూవీ ఫుల్ మీల్స్ పెడ్డటం పక్కా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా వైరల్ అవుతుంది. కాగా.. భారీ అంచనాలతో మే 31వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.


Full View


Similar News