ప్రదీప్ యాంకర్ కాకముందు ఏం చేసేవాడో తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలిసిందే.

Update: 2024-05-25 13:20 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలిసిందే. అదిరిపోయే పంచులతో, కామెడీ టైమింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్.. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇక సినిమా పరంగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడు అనేది పక్కన పెడితే.. ప్రదీప్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది. కేవలం అతని యాంకరింగ్ కోసమే షోస్ చూసువాళ్లే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. దీంతో ప్రస్తుతం పలు టీవీ షోలతో దూసుకుపోతున్నాడు.

అయితే.. ప్రదీప్ యాంకర్ కాక ముందు ఓ డ్యాన్సర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఏంటీ ప్రదీప్ డ్యాన్సరా..! అని షాక్ అవుతున్నారా. మీరు విన్నది నిజమే. యాంకర్ కాక ముందు ప్రదీప్ డ్యాన్సర్‌గా తన లైఫ్‌ను స్టార్ చేశాడు. కానీ, డ్యాన్స్ ద్వారా మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ప్రదీప్ ఓ షోలో పార్టిసిపెంట్ చేసి సరిగ్గా డ్యాన్స్ చెయ్యక జడ్జిలతో నెగిటివ్ కామెంట్స్ తీసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు.. ‘తను డ్యాన్సర్‌గా సక్సెస్ కాలేకపోయాడేమో కానీ.. యాంకర్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అందుకున్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Similar News