నగరవాసులకు గుడ్ న్యూస్: మెట్రో టైమింగ్స్ పొడిగించిన L&T

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ అనంతరం మెల్లమెల్లగా ప్రజారవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. అందులో భాగంగా నగరంలోని మెట్రో రైలు సమయాన్ని మరో అరగంట పెంచేందుకు L&T నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు మొదలవటం, ఆఫీసులు తెరుచుకున్నందున రాత్రి వేళల్లో మెట్రో సర్వీసులను పొడిగించారు. అయితే ఇప్పటి వరకూ మెట్రో సేవలు ఉదయం 7గం.ల నుంచి రాత్రి 9.45గం.ల వరకు మాత్రమే నడిచేవి. ప్రస్తుతం పొడిగించిన సమయంతో రాత్రి 10.15 గంటల వరకు […]

Update: 2021-09-05 02:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ అనంతరం మెల్లమెల్లగా ప్రజారవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. అందులో భాగంగా నగరంలోని మెట్రో రైలు సమయాన్ని మరో అరగంట పెంచేందుకు L&T నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు మొదలవటం, ఆఫీసులు తెరుచుకున్నందున రాత్రి వేళల్లో మెట్రో సర్వీసులను పొడిగించారు. అయితే ఇప్పటి వరకూ మెట్రో సేవలు ఉదయం 7గం.ల నుంచి రాత్రి 9.45గం.ల వరకు మాత్రమే నడిచేవి. ప్రస్తుతం పొడిగించిన సమయంతో రాత్రి 10.15 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

Read also: L&T సంచలన ప్రకటన.. అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..!

Tags:    

Similar News