రిలాక్స్ కాకండి.. కరోనా ముగిసిపోలేదు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదనీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ వర్చువల్ కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. కరోనా కేసులు కచ్చితంగా గణనీయంగా తగ్గాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం, వ్యవస్థలు రిలాక్స్ కాకుడదు. మన ఏడాదిన్నర అనుభవాలు మనకు ఇదే విషయాలను నేర్పాయి. ఇలాంటి తరుణంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా […]

Update: 2021-06-29 20:51 GMT

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదనీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ వర్చువల్ కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. కరోనా కేసులు కచ్చితంగా గణనీయంగా తగ్గాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం, వ్యవస్థలు రిలాక్స్ కాకుడదు. మన ఏడాదిన్నర అనుభవాలు మనకు ఇదే విషయాలను నేర్పాయి. ఇలాంటి తరుణంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది’ అని ఆయన అన్నారు. ‘అదృష్టవశాత్తు గత ఆరు నెలలుగా వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సరైన కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడంతో త్వరలోనే కరోనాపై పోరులో విజయం సాధించవచ్చు’ అని తెలిపారు.

Tags:    

Similar News