డైపర్లలో పుతిన్.. రంగంలోకి రష్యా సీక్రెట్ ఏజెంట్స్ !

‘పుతిన్’ పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ బయోపిక్ రెడీ అవుతోంది. పోలాండ్‌కు చెందిన పాట్రిక్ వేగా డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Update: 2024-05-24 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘పుతిన్’ పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ బయోపిక్ రెడీ అవుతోంది. పోలాండ్‌కు చెందిన పాట్రిక్ వేగా డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి పుతిన్ పాత్రలో స్వచ్ఛత కనిపించేలా చేసేందుకు ఏఐ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. ఈ మూవీలోని ఓ సీన్‌లో పుతిన్ డైపర్‌ ధరించి.. నగ్నంగా నేలపై పడుకొని కనిపిస్తాడు. ఇలాంటి సీన్లు ఉండబట్టే తాను తీస్తున్న సినిమాను రష్యా గూఢచారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని డైరెక్టర్ పాట్రిక్ వేగా తెలిపారు. అమెరికా రాజకీయ సలహాదారులు, ఉక్రేనియన్ ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్‌ల పేరుతో కొందరు రష్యా గూఢచారులు తనకు, తన మూవీ యూనిట్ సిబ్బందికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆయన వెల్లడించారు. కొందరైతే మూవీ స్క్రిప్ట్ ఇచ్చేస్తే లక్ష డాలర్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. నెలక్రితమే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబరు 26న సినిమాను విడుదల చేసేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ సినిమా పుతిన్‌కు కోపం తెప్పించే అవకాశం ఉందని పాట్రిక్ వేగా అభిప్రాయపడ్డారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా మూవీ రిలీజ్ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

Similar News