సాక్ష్యం లేదని అంగీకరించినట్లే.. మోడీకి కేజ్రీవాల్ కౌంటర్

ప్రధాని మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్కసాక్ష్యం లేదని మోడీ అంగీకరించారని తెలిపారు.

Update: 2024-05-24 18:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్కసాక్ష్యం లేదని మోడీ అంగీకరించారని తెలిపారు. సాక్ష్యం లేకుండానే కేంద్ర ఏజెన్సీలు తనను జైళ్లో పెట్టాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ అనుభవజ్ఞుడైన దొంగ. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు” అని మోడీ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే కేజ్రీవాల్ స్పందించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని మోడీ అంగీకరించారని తెలిపారు.

ఎలాంటి రుజువులు, ఆధారాలు లేకుండానే తనను కటకటాల వెనక్కి నెట్టారని ఆరోపించారు. ఎలాంటి రుజువులు లేవని దేశప్రజల ఎదుటు మోడీ అంగీకరించారని తెలిపారు. దాదాపు రెండేళ్లుగా కేసు దర్యాప్తు జరుగుతున్నా ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని పేర్కొన్నారు. గతంలో వంద కోట్ల స్కాం అన్నారని.. ప్రస్తుతం రూ.1100 కోట్ల స్కాం అంటున్నారని తెలిపారు. అయితే, ఇంత డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

Similar News