రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఐదో నిందితుడు అరెస్టు

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఐదో నిందితుడు షోయబ్ అహ్మద్ మీర్జాని అరెస్టు చేసింది.

Update: 2024-05-24 18:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఐదో నిందితుడు షోయబ్ అహ్మద్ మీర్జాని అరెస్టు చేసింది. అతడు గతంలో లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర కేసులో దోషిగా ఉన్నట్లు తెలిపింది. పేలుడు కుట్రకు సహకరించినందుకు కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన మీర్జాను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. మార్చి 3న ఈ కేసుని ఎన్ఏఐ స్వీకరించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా సహా నలుగురిని ఏప్రిల్ 12న అరెస్టు చేసింది. కేఫ్‌లో బాంబును అమర్చింది తహాయేనని భావిస్తున్నారు. వీరిద్దరూ శివమొగ్గ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ, తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లోని 11 చోట్ల ఎన్ఐఏ అధికారులు ఇటీవలే సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News