చార్ ధామ్ యాత్ర.. ఈ ఏడాదిలో 52 మంది యాత్రికులు మృతి

చార్ ధామ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగిపోయింది. మే 10 యాత్ర ప్రారంభం కాగా..వేలాది మంది భక్తులు దర్శనాలకు పోటెత్తుతున్నారు.

Update: 2024-05-24 18:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చార్ ధామ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగిపోయింది. మే 10 యాత్ర ప్రారంభం కాగా..వేలాది మంది భక్తులు దర్శనాలకు పోటెత్తుతున్నారు. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక గత 15 రోజుల వ్యవధిలో 52 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గర్వాల్ కమిషనల్ వినయ్ పాండే తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే అని తెలిపారు. గుండెపోటుతోనే ఎక్కవగా మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు. గంగోత్రిలో ముగ్గురు, యమునోత్రిలో 12 మంది బద్రీనాథ్ లో 14 మంది, కేదార్ నాథ్ లో 23 మంది చనిపోయినట్లు తెలిపారు. 50 ఏళ్లకు పైబడిన యాత్రికులు మెడికల్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఫిట్ నెస్ లేకపోతే యాత్ర చేపట్టవద్దని కోరారు. ఇప్పటివరకు 9,67,302 మంది చార్ ధామ్ యాత్రను సందర్శించుకున్నట్లు తెలిపారు.

Similar News