రానున్న మూడు రోజుల్లో వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావారణ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల […]

Update: 2020-05-01 23:42 GMT

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావారణ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.

Tags: rains, hyd weather centre, three days, telangana

Tags:    

Similar News