రాష్ట్రంలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.. 151 మండలాల్లో తీవ్ర వడగాలులు

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.

Update: 2024-04-29 03:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. పది దాటితే చాలు బయటికెళ్దామంటే వణికిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే నిప్పుల వాన కురిసినట్లుగా ఉంటుంది. దీంతో అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. సగానికి పైగా జిల్లాల్లో వడగాల్పులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. సోమవారం తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. అలాగే ఏపీలో కూడా భానుడి భగభగలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 151 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News