శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి

దేశం సుభిక్షంగా ఉండడం కోసం అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-15 08:00 GMT

దిశ, భద్రాచలం టౌన్ : దేశం సుభిక్షంగా ఉండడం కోసం అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తెల్లవారుజామున శబరిమలై అయ్యప్ప స్వామి వారిని ఆయనతో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని వేడుకోవడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా.. ఇటీవల ఎన్నికల సందర్భంగా తీరికలేని సమయంతో కొంత అలసట, ఒత్తిడి ఏర్పడ్డాయి అన్నారు. శబరిమలై అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడంతో ప్రశాంతత లభించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయ్యప్ప దర్శనం ఎంతో ఆనందం ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ పర్యటనలో ,భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ, డిసిసి చైర్మన్, తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీఎంఎస్ చైర్మన్, మువ్వా విజయ్ బాబు, ఎండి నవాబ్ ఉన్నారు...

Similar News