జగ్గారెడ్డి ఆఫర్‌పై ‘చింతా’ సైలెంట్.. MLA నిర్ణయంపై సంగారెడ్డి పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ..!

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ఆఫర్ ఇవ్వడంపై

Update: 2024-04-29 04:00 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో/సంగారెడ్డి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ఆఫర్ ఇవ్వడంపై రాజకీయంగా చర్చ జరుగుతున్నది. జగ్గారెడ్డి ఆఫర్‌పై చింతా ప్రభాకర్ మౌనంగా ఉండిపోయారు. ఇటీవల గాందీ భవన్‌లో విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓకే అనే ఆఫర్‌ను ప్రకటించారు. చింతా ప్రభాకర్ పార్టీలో చేరినా ఏ అభ్యంతరం లేదని స్వయంగా జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహకు తెలిపినట్లు వివరించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటూ హాట్ కామెంట్ చేశారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి కాంగ్రెస్ చేరికల కమిటీలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన విషయం కూడా తెలిసిందే. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే తన సంగారెడ్డి నియోజకవర్గంపై కూడా దృష్టి సారించారు. ఓ వైపు జగ్గారెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూ సంగారెడ్డి నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులను పార్టీలో చేర్పించుకుంటున్నారు. పటాన్ చెరు, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేర్పిస్తున్నారు.

చింతాకు ఆఫర్..

జగ్గారెడ్డి కూడా తన స్వంత నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు కూడా ఆఫర్ పెట్టారు. కాంగ్రెస్‌లోకి వచ్చినా ఏమి కాదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా తనకు ఏమి అభ్యంతరం లేదు, గెలిపించుకుంటామంటూ మంత్రి దామోదర్‌కు చెప్పినా అని గాంధీ భవన్‌లో ప్రకటించారు. రాష్ట్రంలో ఇది రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. జగ్గారెడ్డి మీడియా ముఖంగా ప్రకటించినా కూడా చింతా ప్రభాకర్ అవునని, కాదనే విషయాన్ని ప్రకటించకుండా మౌనం వహిస్తున్నారు. దీనిపై ఇరు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.

సంగారెడ్డిలో ఎవరి బలం ఎంత..?

ఈ ఎంపీ ఎన్నికలతో సంగారెడ్డి సెగ్మెంట్లో అటు జగ్గారెడ్డికి, ఇటు ప్రజెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ఎవరికి ఎంత బలం ఉందనేది తేలనుంది. జగ్గారెడ్డి రాష్ర్ట వ్యాప్త లీడర్ అయిపోయి ఇతర పార్టీల వారిని చేర్పిస్తున్నారు. చింతా ప్రభాకర్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే బలం గెలుస్తదా..? జగ్గారెడ్డి గెలుస్తడా..? ఎవరికి ఓట్లు ఎక్కువ పడనున్నాయి అనేది రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Similar News