- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి కూలీలకు దొరికిన మందుగుండు
by Batti.Sumithra |
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండలం చాకలివానిపల్లె గ్రామ శివారులో డిటోనెటర్లు, జెనెటిక్స్ లభ్యమయ్యాయి. శుక్రవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చాకలివానిపల్లికి మందుగుండు ఎలా వచ్చిందన్నది అంతుచిక్కకుండా తయారైంది. అనుమతి లేకుండా కొనుగోలు చేసిన డిటోనేటర్లు అవసరానికి మించి ఎవరైనా కొనుగోలు చేసి గ్రామ శివార్లలో పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాకలివానిపల్లి […]</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండలం చాకలివానిపల్లె గ్రామ శివారులో డిటోనెటర్లు, జెనెటిక్స్ లభ్యమయ్యాయి. శుక్రవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చాకలివానిపల్లికి మందుగుండు ఎలా వచ్చిందన్నది అంతుచిక్కకుండా తయారైంది. అనుమతి లేకుండా కొనుగోలు చేసిన డిటోనేటర్లు అవసరానికి మించి ఎవరైనా కొనుగోలు చేసి గ్రామ శివార్లలో పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాకలివానిపల్లి చుట్టు పక్కల ప్రాంతానికి చెందిన వారే పడేశారా? లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చి పడేసి వెళ్లారా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






