అమితాబ్ ఐకానిక్ డైలాగ్‌తో అదరగొట్టేసిన కత్రినా

by  |
అమితాబ్ ఐకానిక్ డైలాగ్‌తో అదరగొట్టేసిన కత్రినా
X

దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో కలిసి కత్రినా కైఫ్‌, స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి శుక్రవారం ఈ షోకు గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో కత్రినా.. అమితాబ్‌ బచ్చన్ కెరీర్‌ను మార్చిన సూపర్ హిట్ మూవీ ‘అగ్నిపథ్’లోని.. ‘పూరా నామ్ విజయ్ దీనానాథ్ చౌహాన్.. బాప్ కా నామ్ దీనానాథ్ చౌహాన్.. మా కా నామ్ సుహాసిని చౌహాన్.. గావ్ మాండ్వా..’ అనే ఐకానిక్ డైలాగ్ చెప్పి అదరగొట్టింది. దీంతో సంతోషంతో చప్పట్లు కొడుతూ అభినందించిన బచ్చన్ జీ… ‘ ఏం చెప్పారు మేడమ్.. మా కడుపు మీద కొట్టేలా ఉన్నారు’ అని కామెడీ చేశారు. కాగా అక్షయ్, కత్రినా, అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో రోహిత్‌శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవంశీ’ సినిమా నవంబర్ 5న విడుదల కానుంది.



Next Story

Most Viewed