కృతితో రొమాన్స్.. ‘గుర్తుకొస్తున్నాయి’ అంటున్న బిగ్ బి

by  |
Amitab Bachan Praises Kritihi Sanon
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ కృతిసనన్‌ను చూస్తే కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయన్నాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ‘హమ్ దో హమారే దో’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కృతి.. బచ్చన్ జీ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 13’ ప్రోగ్రామ్‌కు హాజరై ఆయనతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసిన బిగ్ బి.. బాల్‌రూమ్‌లో రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్న బ్యూటిఫుల్ కృతితో డ్యాన్స్ చేస్తుంటే.. కాలేజ్ అండ్ కోల్‌కతా రోజులకు వెళ్లిపోయానని పోస్ట్ పెట్టాడు. కాగా బిగ్ బి బాలీవుడ్‌కు ఎంటర్ కాకముందు ‘బర్డ్ అండ్ కో’ షిప్పింగ్ ఫామ్‌లో స్టే చేసేవాడు. ఇక కోల్‌కతాలోని నైనిటాల్స్ షేర్‌వుడ్ కాలేజ్‌లో చదివిన ఆయన ఆ తర్వాత ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజ్‌లో చదివాడు.


Next Story