ఆ సినిమా కోసం అమితాబ్ పైసా కూడా తీసుకోలేదట!

by  |
ఆ సినిమా కోసం అమితాబ్ పైసా కూడా తీసుకోలేదట!
X

దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై పొగడ్తల వర్షం కురిపించారు చెహ్రే మూవీ ప్రొడ్యూసర్ ఆనంద్ పండిట్. రుమీ జాఫ్రీ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా పని చేశాడని తెలిపాడు. అంతే కాదు ఫ్లైట్ ఖర్చులు కూడా తనే భరించాడని చెబుతూ.. అమితాబ్ లాంటి కమిట్‌మెంట్ ఉన్న ఆర్టిస్ట్ ను ఇప్పటివరకు చూడలేదని, ఈ చిత్రానికి ముందుగా బచ్చన్ జీని ఫైనల్ చేశాకా, నెక్స్ట్ ఆర్టిస్ట్ గురించి చాలా వెతికామని వివరించాడు.

ఆ తర్వాత ‘ఇమ్రాన్ హష్మీని సెలెక్ట్ చేశాం. అతను చాలా ప్రొఫెషనల్ యాక్టర్. అమితాబ్ క్వాలిటీస్ అతనిలో చూశాను. పని విషయంలో పక్కాగా ఉంటాడు. ఇన్వాల్వ్మెంట్ కూడా అతనికి ఎక్కువే.. అలాంటి నటుడితో మళ్ళీ పని చేయాలని ఉంది’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు ఆనంద్ పండిట్. కాగా ఈ చిత్రంతోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కమ్ బ్యాక్ ఇవ్వనుంది.


Next Story

Most Viewed