చెస్ దిగ్గజం బయోపిక్‌లో అమీర్ ఖాన్?

by  |
చెస్ దిగ్గజం బయోపిక్‌లో అమీర్ ఖాన్?
X

దిశ, సినిమా: ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్‌పై సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శకులు సినిమాలు తీస్తుండగా, అవి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. ‘జయలలిత, ఇందిరాగాంధీ’ బయోపిక్స్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. ఫార్మర్ వరల్డ్ చాంపియన్, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ లీడ్ రోల్ ప్లే చేయనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మహావీర్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. త్వరలో షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ వెల్లడించారు.

అతి చిన్న వయసులో పద్మశ్రీతో సత్కారం, ఆరుసార్లు చెస్ ఆస్కార్ టైటిల్‌తో పాటు పద్మవిభూషణ్ అందుకున్న తొలి క్రీడాకారుడు విశ్వనాథన్‌. ఆయన బాల్యంతో పాటు గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదిగిన తీరు, మూడు దశాబ్దాలుగా చెస్‌ రారాజుగా రాణిస్తున్న సందర్భాన్ని ఈ బయోపిక్‌లో ఆవిష్కరించనున్నారు. సన్‌డయల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘తను వెడ్స్‌ మను, జీరో’ సినిమాల దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఈ మూవీలో టైటిల్ రోల్‌కు అమీర్‌ఖాన్ సెట్ అవుతారని నిర్మాత అభిప్రాయపడ్డారట. అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనని, ప్రస్తుతం స్టోరీపై వర్క్ చేస్తున్నామని, ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే.. నటీనటులు ఎవరన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా అమీర్ ‘దంగల్’ మూవీలో మహవీర్ సింగ్ ఫొగాట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed