సేతుపతిపై రివేంజ్ తీర్చుకున్న అమీర్ ఖాన్

by  |
సేతుపతిపై రివేంజ్ తీర్చుకున్న అమీర్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడన్న విషయం తెలిసిందే. క్యారెక్టర్‌కు తగిన విధంగా సేతుపతి మౌల్డ్ కాలేదని.. వెయిట్ తగ్గలేదనే కారణాలతో అమీర్ అసంతృప్తిగా ఉండటంతో సేతుపతి ఆ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వెళ్లడం.. ఆ ప్లేస్‌లో మరో స్టార్‌ను సెలెక్ట్ చేసుకోవడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అమీర్ సేతుపతిపై రివేంజ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళ్‌లో సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ రీమేక్ నిర్మాతల్లో సేతుపతి కూడా ఒకరు కాగా, తమిళ్‌లో సేతుపతి చేసిన క్యారెక్టర్‌ ప్లే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమీర్.. ఉన్నట్లుండి చివరి క్షణంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీనికి కారణం సేతుపతి ‘లాల్ సింగ్ చద్దా’ కోసం సిన్సియర్‌గా ట్రై చేయకపోవడమే అని బీటౌన్ టాక్.

ఇక అమీర్ ‘విక్రమ్ వేద’ అఫిషియల్ రీమేక్ నుంచి తప్పుకోగా.. ఈ క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు సమాచారం. హిందీ వెర్షన్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌లో తగిన మార్పులు కూడా సూచించిన హృతిక్.. త్వరలో టీమ్‌తో జాయిన్ అవుతారని తెలుస్తోంది. కాగా మేకర్స్ కూడా ముందుగా హృతిక్ రోషన్‌‌ను ‘విక్రమ్ వేద’ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా.. అమీర్‌ ఇంట్రెస్ట్ చూపించడంతో అటు వైపే మొగ్గుచూపారు.



Next Story

Most Viewed